వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి 

వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి 
  • మంత్రి వివేక్​ వెంకటస్వామిని కోరిన మందమర్రి లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు. ఆదివారం హైదరాబాద్​లోని మినిస్టర్​ క్వార్టర్​లో మంత్రిని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ కాంగ్రెస్​ లీడర్లు కలిశారు. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వినాయక నవరాత్రోత్సవాలపై చర్చించారు. మంత్రి ఆధ్వర్యంలో మందమర్రి మార్కెట్​లో  వినాయక మండలి ఏర్పాటు చేయనున్నారు.

9 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించేలా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ఏర్పాట్లు చేయాలని లీడర్లను మంత్రి ఆదేశించారు. మంత్రిని కలిసినవారిలో కాంగ్రెస్ ​టౌన్ ​ప్రెసిడెంట్ మంద తిరుమల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్, లీడర్లు అర్జున్​ మహాతో, పి.నర్సింగ్, గుడ్ల రమేశ్, ఎ.పవన్, ఇషాక్, జావెద్ ఖాన్, కె.సందానందం ఉన్నారు.